హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎంలో రేపు ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు సైబరాబాద్ పోలీసులు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పటికే పలువురు రక్తదాతలు ఉన్నారు. వారితో పాటు స్వచ్ఛందంగా రక్తదానం చేసే వాళ్లు 9490617440, 9490617431 నెంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లోని కొవిడ్ కంట్రోల్ రూమ్‌కి వస్తే ప్రత్యేక వాహనంలో నారాయణగూడ తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో 1700 పైగా ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులు నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సి ఉందని... రక్త నిల్వల కొరత వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్