హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలోని శ్రీనివాస హిల్స్ వాసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఉప్పల్ సీఐ రంగస్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని రంగస్వామి సూచించారు. రక్తదానంపై వస్తున్న అపోహలు నమ్మవద్దని వివరించారు.

ఇదీ చదవండి:తల్లి గర్భంలోనే కరోనాను జయించిన చిన్నారి!