ETV Bharat / state

Black Fungus: బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్ల బ్లాక్ దందా - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ప్రాణాంతక ఔషధాల దందా కొనసాగుతూనే ఉంది. పోలీసులు, ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు చేస్తూ... అరెస్టులు చేస్తున్నా... నల్లబజారులో విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఔషధాలను వాస్తవ ధర కంటే 10రెట్లు అధికంగా పెంచి విక్రయిస్తున్నారు. నిందితుల్లో వైద్యులు కూడా ఉండటం గమనార్హం. మెడికల్ రిప్రజెంటేటివ్​లు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది డబ్బులకు ఆశపడి ఔషధాలను అధిక ధరకు విక్రయిస్తూ పట్టుబడుతున్నారు.

Black fungus drugs on the black market
Black fungus drugs on the black market
author img

By

Published : Jun 4, 2021, 2:03 PM IST

వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు కొంతమంది వైద్యులు. వైద్యో నారాయణ హరి అనే దానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి అనే వైద్యుడు ఈ కోవలోకే వస్తాడు. ఆస్పత్రిలో ఉన్న బ్లాక్ ఫంగస్ రోగులకు ఇవ్వాల్సిన ప్రాణాంతక ఔషధాలను.. పక్కదారి పట్టించి, నల్లబజారులో అధిక ధరకు విక్రయిస్తున్నాడు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఈ విషయం బయటపడింది.

ఇంజక్షన్ల బ్లాక్ దందా

ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి... ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను మాయం చేశాడు. వీటిని చింతల్​లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న వికాస్ రెడ్డికి అధిక ధరకు విక్రయించాడు. వికాస్ రెడ్డి ఒక్కో ఇంజక్షన్​పై 5వేలు అధికంగా తీసుకొని నాగరాజుకు విక్రయించాడు. నాగరాజు మరో రూ.10వేలు ఎక్కువ ధరకు పేట్ బషీరాబాద్​లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న శ్రీధర్​కు విక్రయించాడు. శ్రీధర్... ఇంజక్షన్లు అవసరమైన రోగులకు మరో 5వేలు ఎక్కువ తీసుకొని 45 నుంచి 50వేల వరకు విక్రయించాడు. శ్రీధర్ ఒక అడుగు ముందుకు వేసి ఇతర యాంటిబయటిక్ ఇంజక్షన్లకు ఆంపోటెరిసిన్ స్టిక్కర్లు వేసి... అమాయక రోగులను నమ్మించి విక్రయించడం మొదలు పెట్టాడు. ఆంపోటెరిసిన్ ఇంజక్షన్లను కూకట్ పల్లి ప్రగతినగర్లోని సెలాన్ ల్యాబోరెటరీస్​లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కంపెనీ పేరుమీద జిరాక్స్ సెంటర్​లో స్టిక్కర్లు తయారు చేయించి... పలు యాంటీబయటిక్ ఇంజక్షన్లకు ఈ స్టిక్కర్లు వేసి విక్రయించడం మొదలు పెట్టాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వికాస్, నాగరాజు, శ్రీధర్​లను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 5 లక్షల విలువ చేసే ఔషధాలతో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్కో ఇంజక్షన్ 20 నుంచి 40వేలు

ఓవైపు కరోనా, మరో వైపు బ్లాక్ ఫంగస్ వ్యాధులతో రోగులు ఎంతో ఇబ్బంది పడుతుంటే.... వైద్యానికి ఉపయోగించే ఔషధాలకు రెక్కలొచ్చాయి. పది రోజుల క్రితం వరకు రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్​లో విక్రయించారు. ఇంజక్షన్ వాస్తవ ధర 3500 ఉంటే... నల్ల బజారులో 20 నుంచి 40వేల వరకు విక్రయించారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా బయటపడుతుండటంతో వైద్యానికి ఉపయోగించే ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇంజక్షన్ ధర కంపెనీని బట్టి 500 రూపాయల నుంచి 7వేల రూపాయల వరకు ఉంది. కానీ అవసరాన్ని బట్టి 40వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఇంజక్షన్లను ఆస్పత్రుల్లో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. లేకపోతే ఔషధ పరిశ్రమలకు చెందిన సంబంధిత డీలర్లు, డిస్ట్రిబ్టూటర్లు... వైద్యుల సిఫారసు లేఖను చూసి రోగి సహాయకుడికి మాత్రమే అందించాల్సి ఉంటుంది. కానీ మెడికల్ షాపు నిర్వాహకులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది కుమ్ముక్కై నల్లబజారులో అధిక ధరకు విక్రయిస్తున్నారు.

నకిలీ స్టిక్కర్లు వేసి

కొందరు ప్రాణాంతాక ఔషధాలను అధిక ధరకు విక్రయిస్తుంటే... మరికొందరు నకిలీ స్టిక్కర్లు వేసి ప్రాణాంతక ఔషధాలుగా నమ్మిస్తు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: తెరాసకు ఈటల రాజేందర్​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.