సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ప్రైవేట్ దవాఖానాల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైన చర్య కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స కోసం వచ్చే పేద ప్రజల వద్ద ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.
కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్