ETV Bharat / state

పేదల అవస్థల పట్ల దాతలు స్పందించాలి: బీజేవైఎం - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​ నగరంలోని ఆటో డ్రైవర్లకు బీజేవైఎం అండగా నిలిచింది. వారం రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను బీజేవైఎం నాయకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఉపాధి కరవై అవస్థలు పడుతున్న పేదల పట్ల దాతలు స్పందించాలని కోరారు.

bjym distribute groceries, hyderabad bjym
ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ, హైదరాబాద్ బీజేవైఎం
author img

By

Published : May 19, 2021, 12:32 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కరవై అవస్థలు పడుతున్న పేదల పట్ల అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ హైదరాబాద్ బీజేవైఎం కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లకు వారం రోజులకు సరిపడ బియ్యం, వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు.

సమాజంలోని పేదల జీవనం దుర్భరంగా మారే ప్రమాదాన్ని దాతలు గ్రహించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.