ETV Bharat / state

బంజారాహిల్స్ పబ్​లో దొరికిన వారందరిని కఠినంగా శిక్షించాలి: బీజేవైఎం - హైదరాబాద్ తాజా వార్తలు

BJYM: బంజారాహిల్స్ ఘటనకు నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆందోళన చేపట్టారు.

BJYM
బీజేవైఎం
author img

By

Published : Apr 3, 2022, 6:47 PM IST

BJYM: హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్​లో దొరికిన వారందరిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కేసులో పలుకుబడి ఉన్న వారి పేర్లు తొలగిస్తున్నారన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. నిరసన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అసలేం జరిగిదంటే: హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను అర్థరాత్రి దాటాక కూడా తెరిచి ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి పబ్​ నడపడంతో పబ్‌ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలు

ఇదీ చదవండి: 'డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.