హైదరాబాద్‌లోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినాయక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ తరపున పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు , విద్యుత్ కనెక్షన్, మరుగు దొడ్లు తదితర మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తోందని లక్షణ్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం