ETV Bharat / state

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar : ఒకే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఫైర్​ బ్రాండ్​ నేతల పోటీ.. బీజేపీ ప్లాన్​ వర్కౌట్​ అయ్యేనా..? - కొరుట్ల నుంచి ఎంపీ అరవింద్ పోటీ

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగనుంది. బీజేపీ ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఈసారి సీఎం కేసీఆర్​పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్.. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ బరిలో నిలుస్తుండటంతో అందరి కళ్లూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు చూడనున్నాయి.

BJP MPs Aravind And bandi Sanjay
Etela Rajender To Contest Gajwel and Huzurabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 9:44 AM IST

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈసారి రాజకీయం రసవత్తరంగా సాగనుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించినట్టుగా స్పష్టం అవుతోంది. మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్​పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవల హుజూరాబాద్​లో పర్యటించినప్పుడు కూడా తాను రెండు చోట్లా పోటీ చేస్తానని సవాలు విసిరారు. అయితే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్, గజ్వేల్‌లలో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Etela Clarity on Competition from Gajwel : గజ్వేల్ నుంచి పోటీపై ఈటల రాజేందర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే..?

Political Heat in Sircilla District : దీంతో ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రి కేసీఆర్​పై ప్రత్యర్థిగా నిలబడనున్నారు. కేసీఆర్ వెన్నంటి నడిచిన అనుచరుడే.. నేడు ప్రత్యర్థిగా బరిలో నిలుస్తుండటంతో గజ్వేల్ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. అలాగే బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన వాటిల్లో.. గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల కూడా ప్రాధాన్యత సంతరించున్న నియోజకవర్గాల్లో ఒకటి కావడం విశేషం. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తుండడంతో ఆయనపై ఎవరు పోటీ చేస్తున్నారని ఆరా తీసే వారు చాలా మంది ఉంటారు. బీజేపీ తరుపున రాణి రుద్రమ పోటీ చేస్తుండటంతో.. ఈసారి ఇక్కడి ఎన్నికల తీరు ఎలా ఉండనుంది అనే అంశంపై చాలా మంది ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి.

"హుజూరాబాద్ ఎన్నికల తర్వాత నేను ఛాలెంజ్ చేశాను. నా మీద ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినవ్. మంత్రులు, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేశారు. అధికార యంత్రాంగాన్ని మొత్తం కేంద్రీకరించి.. ఒక్కరిపై చాలా ఫైట్ చేశారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఓడించడమే ముఖ్య లక్ష్యం అని చెప్పాను. వాళ్లని హూజూరాబాద్​ నుంచి పోటీ చేయమని కూడా అన్నాను. ఇప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నా. అందుకే నేనే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నా. మేము ప్రజల మద్దతు.. ఆశీర్వాదం కలిగిన వాళ్లం. నూటికి నూరు శాతం ఈ దఫా కేసీఆర్ ఓటమి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉందని తెలియజేస్తున్నా." - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే, హుజూరాబాద్‌

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar ఒకే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఫైర్​ బ్రాండ్​ నేతల పోటీ బీజేపీ ప్లాన్​ వర్కౌట్​ అయ్యేనా

BJP MPs Aravind To Contest Jagtial : బీజేపీ ఫైర్ బ్రాండ్‌లుగా ముద్రపడ్డ ఇద్దరు ముఖ్య నేతలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పోటీ చేస్తుండడం విశేషం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఈ ఇద్దరు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించే తీరుతో ఫైర్ బ్రాండ్​లుగా పేరుగడించారు. ఈ ఇద్దరు నాయకులు కూడా ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తుండంటం చర్చనీయాంశం.

BJP MP Aravind Fires on KCR Family : 'అవినీతి సొమ్మును రికవరీ చేసి మీ ముందు ఉంచుతాం'

Bandi Sanjay Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీకి గ్రాఫ్​ తగ్గలేదు.. బీఆర్​ఎస్​ను ఎదుర్కొనే సత్తా మా పార్టీకి మాత్రమే ఉంది : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.