భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నడ్డా.. బాగ్‌లింగంపల్లిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు స్థానికులకు సభ్యత్వమిచ్చారు. ఈ కార్యక్రమంలో నడ్డాతోపాటు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత బాగ్‌లింగంపల్లి అంబేడ్కర్ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం జేపీ నడ్డా దిల్లీకి తిరుగుపయనమయ్యారు.
ఇదీ చూడండి: 'మహాత్ముడి కలల భారతాన్ని నిర్మించామా?