ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా గ్రేటర్ పీఠం భాజపాదేనని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు.
హిమాయత్‌నగర్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన మహాలక్ష్మి గౌడ్‌కు మద్దతుగా... చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. దుబ్బాకలో ఉపఎన్నిక ఫలితమే గ్రేటరలోనూ పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు.
కుంభవృష్టితో హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతే ఒక్క బాధితుడనీ పరామర్శించని ముఖ్యమంత్రికి ప్రజలు బుద్దిచెప్పబోతున్నారు. రూ.10 వేలు అందరికి ఎందుకు ఇవ్వలేదు. ఇళ్లలోని అన్ని వస్తువులు పోయాయి. పదివేలు ఇచ్చి చేతులు దులుపుకుందామనుకున్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ కట్టారో ప్రజలకు చెప్పాలి.
-చింతల రామచంద్రారెడ్డి
ఇవీచూడండి: రేపు చార్మినార్కి వస్తా.. దమ్ముంటే కేసీఆర్ రావచ్చు: సంజయ్ సవాల్