ETV Bharat / state

'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే' - kcr news

హైదరాబాద్​ పార్టీ కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, పార్టీ శ్రేణులు మేడారం జాతరకు వెళ్లారు. ఇవాళ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెరాస పండుగుల పేరుతో దోచుకుంటుందని ఆరోపించారు లక్ష్మణ్​.

BJP telangana state President laxman going to medaram
'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే'
author img

By

Published : Feb 6, 2020, 1:56 PM IST

మేడారానికి 2 వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి మాయమైన కేసీఆర్...​ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని జాతరకు వస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ ప్రశ్నించారు. ఈ జాతరకు 98 కోట్లు కేటాయిస్తే... అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని ఆరోపించారు.

పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాస తెరలేపిందని మండిపడ్డారు. నలుగురు కలెక్టర్ల మార్పు దీనికి అద్దం పడుతుందన్నారు. హైదరాబాద్​ పార్టీ కార్యాలయం నుంచి పది వాహనాల్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్​ నేతృత్వంలో పార్టీ శ్రేణులు మేడారం జాతరకు బయలుదేరారు. సమ్మక్క, సారలమ్మలను లక్ష్మణ్​తో పాటు పార్టీ శ్రేణులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే'

ఇదీ చూడండి : మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.