ETV Bharat / state

ఓవైపు పేపర్ లీక్స్.. మరోవైపు బండి సంజయ్​ అరెస్టు.. రాష్ట్రంలో రాజుకున్న రాజకీయం

Bandi Sanjay Arrest Latest Update: రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికి వచ్చిన వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నిన్న హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికి వచ్చిన ఉదంతంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొన్ని గంటల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయటం సంచలనంగా మారింది. సంజయ్‌ను కరీంనగర్‌ యాదాద్రి జిల్లా బొమ్మలరామారం ఠాణాకు తరలించిన పోలీసులు.. అనంతరం అక్కడి నుంచి తీసుకువెళ్లి పాలకుర్తిలో వైద్యపరీక్షలు జరిపించారు. కాసేపట్లో ఆయణ్ను హనుమకొండ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.

Bandi Sanjay Arrest
Bandi Sanjay Arrest
author img

By

Published : Apr 5, 2023, 1:38 PM IST

Bandi Sanjay Arrest Latest Update: పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికి రావటం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు ఘటనతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్‌లో నిన్న అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత నడుమ.. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతినగర్‌లోని తన అత్తగారింట్లో ఉన్న బండి సంజయ్‌ వద్దకు వెళ్లిన పోలీసులు బలవంతంగా తీసుకువచ్చారు.

రాత్రికి రాత్రే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం ఠాణాకు సంజయ్‌ను తరలించిన పోలీసులు ఉదయం పదిన్నర వరకు అక్కడే ఉంచారు. సంజయ్‌ అరెస్టు గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.

అరెస్టు ఎందుకు చేశారనే విషయం తెలుసుకునేందుకు బొమ్మలరామారం స్టేషన్‌ వద్దకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదిన్నర ప్రాంతంలో భారీ కాన్వాయ్‌ మధ్య సంజయ్‌ను పోలీసులు బొమ్మలరామారం ఠాణా నుంచి బయటకు తీసుకువెళ్లారు. ముందుగా భువనగిరి కోర్టుకు తీసుకెళుతున్నట్లుగా సమాచారం ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత రూట్ మార్చి హనుమకొండ వైపుగా బండి సంజయ్ వాహనాన్ని తీసుకెళ్లారు. తమ నేతను ఎటువైపు తీసుకెళ్తున్నారంటూ మార్గమధ్యలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు.

Bandi Sanjay Arrest: ఆలేరు సమీపంలోని పెంబర్తి వద్ద బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పాలంటూ నినాదాలు చేయగా.. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంజయ్‌ను హనుమకొండ వైపుగా తీసుకెళ్లారు. అనంతరం జనగామ జిల్లా పాలకుర్తి ఆస్పత్రిలో సంజయ్‌కు వైద్య పరీక్షలు జరిపించారు. ఆ తర్వాత పాలకుర్తి మీదుగా వర్దన్నపేటకు తీసుకువెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి వరంగల్‌ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పటిషన్​ : మరోవైపు బండి సంజయ్‌ ఆచూకీపై హైకోర్టులో బీజేపీ నేత సురేందర్​రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​లో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్న పిటిషనర్‌ సురేందర్​రెడ్డి సీఆర్పీసీ 50 కింద అరెస్టు చేస్తే కుటుంబ సభ్యులకు చెప్పాలని కానీ బండి సంజయ్​ విషయంలో పోలీసులు అలా చేయలేదని ఆరోపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, రాచకొండ సీపీతో పాటు బొమ్మలరామారం సీఐని చేర్చారు.

ఇవీ చదవండి:

బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్​

బండి సంజయ్ అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళనలు

బండి సంజయ్​ను పరామర్శించేందుకు వెళ్లిన రఘునందన్.. అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.