ETV Bharat / state

Bandi sanjay: 'ఎన్నికలొస్తేనే హామీలు.. కులాల పేరిట కుమ్ములాటలు' - lashkar bonalu 2021 news

భాగ్యనగరంలో లష్కర్​ బోనాలు(Lashkar Bonalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం 4గంటలకు ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు మహంకాళిని దర్శించుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay)​ అమ్మవారిని దర్శించుకున్నారు.

lashkar bonalu
లష్కర్​ బోనాలు
author img

By

Published : Jul 25, 2021, 3:56 PM IST

సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి(Lashkar Bonalu) బోనాల వేడుక వైభవోపేతంగా కొనసాగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay)​​.. అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్​ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నారు.

మహిళలు అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా తల్లి దీవెనలు మనకు ఉంటాయని సంజయ్​ అన్నారు. లష్కర్​ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రంలో తెరాస పాలనపై బండి సంజయ్​ విమర్శలు గుప్పించారు.

ఎన్నికలొస్తేనే హామీలు.. కులాల పేరిట సమాజంలో చిచ్చు: బండి సంజయ్​

ఎన్నికలొస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్​హోస్​ నుంచి బయటికొస్తారు. సమావేశాలు పెట్టి లేనిపోని హామీలు ఇస్తారు. కులాలు, మతాలు, వర్గాల పేరిట సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి మంచి ఆలోచన కలిగించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, పరిపాలకులు నీతి, నిజాయతీతో ఉంటే ప్రజలకు ఏ కష్టాలు ఉండవని బండి అభిప్రాయపడ్డారు. కానీ దైవ భక్తుడనని చెప్పుకునే సీఎం కేసీఆర్​.. ఫామ్​హౌస్​కే పరిమితమై ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికలొస్తేనే ఫామ్​హోస్​ నుంచి బయటకొస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హైదరాబాద్​లో సమావేశాలు పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడి.. లేనిపోని హామీలు ఇస్తారని ఎద్దేవా చేశారు. కులాలు, వర్గాలు పేరిట సమాజాన్ని చీలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి మనసు మార్చి రాష్ట్రంలో మంచి పరిపాలన ఉండేలా చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: Lashkar Bonalu : లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.