ETV Bharat / state

అదసలు మెజార్టీయే కాదు.. భవిష్యత్‌ భాజపాదే: తరుణ్‌చుగ్‌ - Tarun Chug COMMENTS ON TRS

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదివేల ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించడమంటే ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దంపడుతోందని అన్నారు. భవిష్యత్ భాజపాదే అని స్పష్టం చేశారు.

Bjp Tarun Chug FIRES on TRS
అదసలు మెజార్టీయే కాదు.. భవిష్యత్‌ భాజపాదే: తరుణ్‌చుగ్‌
author img

By

Published : Nov 7, 2022, 7:20 PM IST

భాజపాపై కేవలం పదివేల ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించడమంటే ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దంపడుతోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ భాజపాదేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు.

మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం సహా నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు గుప్పించినా... మంత్రులు ప్రచారం చేసిన చోట భాజపా అధిక్యం సాధించడం చూస్తే ‌తెరాస పట్ల ప్రజలకున్న అపనమ్మకాన్ని తెలుపుతుందని వివరించారు. అసెంబ్లీని, అధికారాన్ని ఉపయోగించినా స్వల్ప మెజారిటీతో తెరాస సాంకేతికంగా విజయం సాధించినప్పటికీ, నైతిక విజయం మాత్రం భాజపాదేనని తెలిపారు.

తెరాస నాయకులు భాజపాపై, ఎన్నికల గుర్తులపై విమర్శలు చేయడం మానుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రితో సహా మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ తమ తమ హామీలను నిలబెట్టుకోవాలని... 15 రోజుల్లోపు చేస్తామన్న అభివృద్ధిని చేసి చూపించాలని తెరాస నాయకులకు స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.