ETV Bharat / state

తెలంగాణలో పేదల ప్రభుత్వం తీసుకువస్తాం : బీజేపీ - ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం

BJP Street Corner Meetings in TS: కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ పూర్తిగా దోపిడీకి గురవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన 'ప్రజా గోస- బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వీధి సభకు హాజరైన కిషన్‌రెడ్డి.. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం తీసుకువస్తామని తెలిపారు.

BJP
BJP
author img

By

Published : Feb 26, 2023, 8:08 AM IST

'రాష్ట్రంలో.. పేదల ప్రభుత్వం తీసుకువస్తాం'

BJP Street Corner Meetings in TS: 'ప్రజాగోస-బీజేపీ భరోసా' పేరుతో రాష్ట్రంలో బీజేపీ వీధివీధిన సమావేశాలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కమలదళం.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర సర్కార్‌ వైఫల్యాలను వివరిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్రం సహకారంతో పక్క రాష్ట్రం ఏపీలో లక్షల ఇళ్లు నిర్మిస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఆ దిశగా ఆలోచించటం లేదన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం కాదని.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలుచేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో 24గంటల కరెంటు వస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: బీజేపీ అధికారంలోకి వచ్చాక నయీమ్‌ డైరీ, ఆస్తులను బయటికి తీసుకువస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన వీధి సభలకు ఆయన హాజరయ్యారు. తమ అనుచరుల వ్యాపారాలకు మేలు చేసేందుకే కేసీఆర్ మిషన్‌ భగీరథ తెచ్చారన్న సంజయ్‌.. రాష్ట్రంలో 24గంటల కరెంటు వస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసమే యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారని ఆరోపించారు.

నేడు కేసీఆర్‌ సైతం అదే ధోరణి: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రామాలయం కూడలిలో జరిగిన బీజేపీ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి హాజరయ్యారు. నాడు నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బానిస బతుకులు బతికారన్న విజయశాంతి.. నేడు కేసీఆర్‌ సైతం అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మోదీ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చుతున్నారని ఆమె విమర్శించారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో వీధి సభ జరుగుతుండగా బీజేపీ-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కార్యక్రమం మధ్యలోనే టెంటు కూలిపోగా.. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కుర్చీలను విసిరేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు.

"తెలంగాణకు పట్టిన శాపం కేసీఆర్ కుటుంబం. ఈ పాలనకు విముక్తి కల్పించాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. అంటే కల్వకుంట్ల రాజ్యాంగమా. నిజాం పరిపాలన ఏవిధంగా ఉండేదో దానిని తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారు." -కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

"నయీమ్ డైరీ ఆస్తులను బయటకి తీసుకువస్తాం. దానిపై సిట్ వేశారు. వాటన్నింటిని ఏం చేశారూ. మా ప్రభుత్వం అధికారంలో రాగానే నయీమ్ డైరీ ఆస్తులన్ని బయటకు తెస్తాం. బాధితులకు అండంగా ఉంటాం." -బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: కేసీఆర్ లేకపోతే.. కేటీఆర్​ను ఎవరూ లెక్కచేయరు : బండి సంజయ్

ఐదు కోట్ల ఏళ్ల నాటి చీమలు!.. అరుదైన ఘనత సాధించిన భారత శాస్త్రవేత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.