NVSS Prabhakar on kcr: లోక్‌సభ, రాజ్యసభలో తెరాస ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఎంపీల ప్రవర్తనపై తెలంగాణ రైతులు తలదించుకుంటుంన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికలు తప్ప... రైతుల ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పార్లమెంట్ నుంచి తెరాస ఎంపీలు పారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో ఒప్పందం మేరకు ధాన్యం ఎందుకు సేకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు, సీట్లు, నోట్లు తప్పితే ప్రజల సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ధాన్యం సేకరణపై దృష్టిపెట్టకుండా క్యాంపుల్లో సేదతీరుతున్నారని విమర్శించారు. కోడ్ అమల్లో ఉన్నా అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ నిధులు విడుదల చేస్తున్నారని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారా?
'ఓట్లు, నోట్లు, సీట్లు తప్పితే ప్రజల పాట్లు మాత్రం ఈ ప్రభుత్వానికి పట్టలేదు. ముఖ్యమంత్రికి సమీక్షించే సమయం లేదు. ధాన్యం సేకరణ రోజువారీ లెక్కలు స్వీకరించే తీరిక అంతకంటే లేదు. ఏ రకంగానైనా ఓట్లు, సీట్లు దక్కించుకోవాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అసలు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారా?. పౌర సరఫరాల శాఖ మంత్రి ధాన్యం సేకరణపై దృష్టిపెట్టకుండా క్యాంపుల్లో సేదతీరుతున్నారు.'
-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇదీ చదవండి:
BJP Leaders Meet Amith shah: అమిత్ షాను కలవనున్న రాష్ట్ర భాజపా నేతలు.. అందుకోసమేనా?