ETV Bharat / state

'అక్రమ సంపాదనతో పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్లారు..'

NVSS Prabhakar on KTR: మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన పెట్టుబడులు తేవడానికి కాదని.. అక్రమ సంపాదన సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికి వెళుతున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటికే పలు దేశాలు పర్యటించిన కేటీఆర్​.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పారని.. కానీ ఒక్క పెట్టుబడి కూడా రాలేదని ప్రభాకర్‌ విమర్శించారు. విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులను బహిర్గతం చేస్తామని చెప్పారు.

'అక్రమ సంపాదనతో పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారు..'

author img

By

Published : Mar 19, 2022, 7:12 PM IST

NVSS Prabhakar on KTR: మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన పెట్టుబడులు తేవడానికి కాదని.. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికి వెళుతున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటికే పలు దేశాల్లో కేటీఆర్ పర్యటించారని.. పర్యటనలు విజయవంతమయ్యాయని చెప్పారన్నారు. భారీగా పెట్టుబడులు వస్తాయని మంత్రి చెప్పారని.. కానీ ఇప్పటివరకు ఒక్క పెట్టుబడి కూడా రాలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారని.. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్​, కేటీఆర్​లు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదని... వేరే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడానికే 111జీవోను సవరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రికి కేటీఆర్ అసమర్థుడని... హైదరాబాద్​ను మురికి కూపంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా ప్రజలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. 'కశ్మీర్ ఫైల్స్' సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్​ కోరారు.

త్వరలోనే బహిర్గతం చేస్తాం..

ఇప్పటికే పలు దేశాల్లో కేటీఆర్ పర్యటించారు. పర్యటనలు విజయవంతం అయ్యాయని చెప్పారు. భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. వారు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదు.. వేరే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారు. వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తాం.

-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

'అక్రమ సంపాదనతో పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారు..'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.