ETV Bharat / state

'కార్పొరేషన్ నిధులతో కేసీఆర్‌ భజన చేయడం దారుణం'

కేసీఆర్‌ ఒక్కరు కొట్లాడితేనే తెలంగాణ వచ్చినట్లు తెరాస నాయకులు ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దీక్షా దివస్‌ పేరిట సీఏం దృష్టిలో పడాలని కార్పొరేషన్ నిధులతో పలువురు ప్రజాప్రతినిధులు కేసీఆర్ బొమ్మలు, శిలఫలకాలు, పైలాన్‌ ఆవిష్కరించడం దారుణమన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే... ప్రజలే సరైన బుద్దిచెబుతారని రాకేష్‌ రెడ్డి తెలిపారు.

BJP state spokesperson Elephant Rakesh Reddy said that it is bad to do KCR bhajan with corporation funds.
'కార్పొరేషన్ నిధులతో కేసీఆర్‌ భజన చేయడం దారుణం'
author img

By

Published : Feb 7, 2021, 2:24 PM IST

సీఎం కేసీఆర్‌ ఒక్కరు కొట్లాడితేనే తెలంగాణ వచ్చినట్లు తెరాస నాయకులు ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దీక్షా దివస్‌ పేరిట సీఏం దృష్టిలో పడాలని కార్పొరేషన్ నిధులతో పలువురు ప్రజాప్రతినిధులు కేసీఆర్ బొమ్మలు, శిలఫలకాలు, పైలాన్‌ ఆవిష్కరించడం దారుణమన్నారు.

ప్రజల సొమ్ముతో తెరాస పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును సొంత డబ్బా కొట్టుకోవడానికి ఖర్చు చేస్తే చూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కార్పొరేషన్ నిధులతో కేసీఆర్‌ భజన చేస్తున్న తెరాస మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ప్రజలే సరైన సమయంలో బుద్ది చెబుతారని రాకేష్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: భారతీయ 'టీ'పై విదేశీ కుట్ర: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.