వైకాపా నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని భాజపా ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ... దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడపలో పర్యటించిన ఆయన... కమలం గుర్తుకే ఓటేయలంటూ ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో జగన్‌కు ప్రత్యర్థి భాజపాయేనని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీసులు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని వీర్రాజు ఆరోపించారు.. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి... ప్రజా మద్దతు లేకనే ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామ్య వ్యవహారాలకు నరేంద్రమోదీ నాయకత్వం.. చెక్ పెడుతుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్