తెలంగాణ పురపాలక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఏకైక పార్టీ భాజపా అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పుర ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లలో తెరాస అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు.
తుక్కుగూడలో భాజపాకు ఛైర్మన్ వచ్చేదని, కానీ తెరాస అడ్డుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. నిజామాబాద్లో పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసను తిరస్కరించారని పేర్కొన్నారు. భైంసాలో ఒక్క వార్డు గెలవని తెరాస భాజపాను విమర్శించడమేంటని ప్రశ్నించారు.
జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.