ETV Bharat / state

Bandi Sanjay: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయండి... కేంద్రానికి బండి సంజయ్​ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్​ అనుసరిస్తున్న వైఖరితో కృష్ణా జలాల హక్కుల విషయంలో తెలంగాణ నష్టపోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కృష్ణానదీ జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడాలంటే కేఆర్​ఎంబీ పరిధి నోటిఫై చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాసినట్లు తెలిపారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆర్​ అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారని బండి సంజయ్‌ మండిపడ్డారు.

కృష్ణా రివర్​ బోర్డు పరిధిని ఖరారు చేయండి... కేంద్రానికి బండి సంజయ్​ లేఖ

author img

By

Published : Jul 4, 2021, 3:20 AM IST

Updated : Jul 4, 2021, 6:20 AM IST

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాలని కోరారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​కు లేఖ రాసినట్లు బండి సంజయ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల బాగోగుల్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం నదీ జలాల అంశాల్ని వివాదం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు.

రాష్ట్రానికి దక్కాల్సింది 555టీఎంసీలు

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో 811 టీఎంసీల కృష్ణా జలాల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తాత్కాలిక ప్రాతిపదికన వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేశారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రం కేవలం 299 టీఎంసీలు మాత్రమే వాడుకొని... ఆంధ్రప్రదేశ్​ 512 టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్ అంగీకరించి... ఘోర తప్పిదం చేసి తెలంగాణ నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5శాతం ఉందని... దీని ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీల వాటా రావాల్సి ఉందన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీశారని ఆక్షేపించారు.

అదనపు వాటా కోల్పోయేలా చేశారు..

రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పినా వినకుండా ఆరేళ్ల సమయాన్ని వృథా చేసి... కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన అదనపు వాటా కోల్పోయేలా చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు కేంద్రమే చొరవ తీసుకుందని... కానీ కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరినట్లు తెలిపారు. తద్వార కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కాపాడటం సాధ్యమవుతుందన్నారు. కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చాక దాని ప్రకారం రాష్ట్రానికి వచ్చే కృష్ణా నీటి కేటాయింపులు పూర్తిగా తెలంగాణకే చెందేలా కేఆర్ఎంబీ కాపాడటం సాధ్యమవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: CM KCR: 'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ ఎత్తిపోతలా అక్రమమే'

Last Updated : Jul 4, 2021, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.