సూర్యాపేటలో కబడ్డీ పోటీల సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైన బాధితులను ఎవ్వరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారన్నారు.
ఈ పోటీలను ప్రభుత్వం నిర్వహించిందా.. లేక రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులా అని ప్రశ్నించారు. ఇంత వరకూ ఏ ఒక్క మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోటీలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థల్లో నష్టాలు: కాగ్