హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకత్వానికి నిర్వచనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తానన్న సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నేటి యువత ముందుకుసాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని నియంతపాలనకు చరమగీతం పాడేందుకు యువత ముందుకు రావాలని బండి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు.. ఇద్దరు మృతి