ETV Bharat / state

ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు​ ప్రోత్సాహకాలు ఇవ్వాలి: బండి

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, పోలీసులు, జర్నలిస్టులకు.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి మరింత ఉత్సాహంగా పనిచేసేలా చూడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

బండి సంజయ్​
బండి సంజయ్​
author img

By

Published : May 13, 2021, 9:54 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్​ టెక్నిషియన్లు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ఉస్మానియా, గాంధీ వైద్యశాలతోపాటు జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బందికి వర్తింపజేయాలన్నారు.

మూడు నెలల కోసం 50 వేల మంది వైద్య సిబ్బంది భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిందన్నారు. వైద్య సిబ్బందితో పాటు ఇతర సిబ్బందినీ దాదాపు లక్ష మందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇది మూడు నెలల కోసం కాకుండా శాశ్వత ఉద్యోగులుగా నియమించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తే తెలంగాణ పేద ప్రజల పాలిట శాపంగా మారుతుందన్నారు. గత సంవత్సర కాలంగా కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాప్, టెక్నీషియన్లను వెంటనే నియమించకపోతే రాష్ట్ర ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీపై లాక్‌డౌన్‌ ప్రభావం...కేంద్రాలకు తగ్గిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.