అమరవీరుల బలిదానాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దురదృష్టవశాత్తు ఉద్యమకారుల ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెరాసలో యజమానుల పంచాయతీ మొదలయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఉద్యమకారుల ఆశయ, లక్ష్య సాధన కోసం భాజపా పాటుపడుతోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కుటుంబం, ఓవైసీ పార్టీ ఈ రెండే బాగు పడ్డాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష