ETV Bharat / state

'కేంద్రాన్ని బద్నామ్ చేయడం దారుణం' - ముఖ్యమంత్రికి లేఖ రాసిన బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా ఫామ్ హౌజ్ పాలనతో కాలయాపన చేస్తూ.. హక్కులపై స్పందించకుండా కేంద్రాన్ని బద్నామ్ చేయడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు.

'కేంద్రాన్ని బద్నామ్ చేయడం దారుణం'
'కేంద్రాన్ని బద్నామ్ చేయడం దారుణం'
author img

By

Published : Oct 4, 2020, 2:18 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్... కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కి రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ... కేంద్రానికి లేఖ రాయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని... తెలంగాణ నీటి వాటా హక్కులు సాధించుకోవడానికి వినియోగించుకుంటారా లేక కేంద్రంపై రాజకీయ విమర్శలకు వేదికగా వాడుకుంటారో స్పష్టం చేయాలన్నారు.

సీఎం చేసింది శూన్యం..

విభజన చట్టం ప్రకారం తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేసింది శూన్యమన్నారు. ఆరేళ్లుగా ఫామ్ హౌజ్ పాలనతో కాలయాపన చేస్తూ.. హక్కులపై స్పందించకుండా కేంద్రాన్ని బద్నామ్ చేయడం దారుణమని దుయ్యబట్టారు. కృష్ణానది నీటి భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకోవడానికి మీరు కేంద్రానికి రాసిన రెండు లేఖలపై ట్రిబ్యునల్ లో విచారణ జరగడం లేదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుపై ఇప్పటివరకు కేంద్రానికి కేసీఆర్ స్వయంగా ఏ లేఖా రాయలేదనేది నిజం కాదా అన్నారు.

కాలయాపన..

ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టును ఆపడానికి కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం ద్వారా ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: కసరత్తు ముమ్మరం: 11 అంశాలతో పాసుపుస్తకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.