ETV Bharat / state

'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానమే..' - 'నియంత్రిత సాగు విధానం.. నిర్భంద సాగు విధానమే..'

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు విధానంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రాష్ట్ర ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విధానం నియంత్రితమైంది కాదని, రైతులకు వాటి వల్ల నష్టాలు వస్తాయని బండి సంజయ్ తెలిపారు.

bandi sanjay fires on trs governent
'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్భంద సాగు విధానమే..'
author img

By

Published : May 30, 2020, 2:54 PM IST

Updated : May 30, 2020, 3:32 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు విధానం నియంత్రితమైంది కాదని... ఇది నిర్భంధ సాగు విధానమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ వ్యవసాయ సంస్కరణలకు, పంట కాలనీలకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా, నిపుణులను సంప్రదించకుండా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్భంధ సాగు విధానాన్ని తీసుకురావడాన్ని భాజపా వ్యతిరేకిస్తోందన్నారు.

కేంద్రమిచ్చిన 125 కోట్లు ఎమయ్యాయి..?

పంట మార్పిడి విధానం విజయవంతం కావాలంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచించిన విధంగా భూసార పరీక్షలు నిర్వహించి, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేస్తే విజయవంతమైన ఫలితాలు వస్తాయన్నారు. అంతేకాని అశాస్త్రీయంగా పంట సాగు విధానం తీసుకురావడం ఏమాత్రం సరికాదని బండి సంజయ్ తెలిపారు. అసలు రాష్ట్రంలో భూసార కార్డులు ఇచ్చేందుకు కేంద్రం విడుదల చేసిన రూ. 125 కోట్లు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో నియంత్రిత సాగు విధానంపై అనుసరించాల్సిన విధానాలపై భాజపా రాష్ట్ర ముఖ్య నాయకులతో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అఖిలపక్ష సమావేశం తప్పనిసరి..

రాష్ట్రంలో తెరాస సర్కారు ఇంతవరకూ ఏ రైతుకూ భూసార పరీక్షలు చేసి కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. మరి, ఏ ఆధారంతో పంట మార్పిడి చేయాలంటున్నారో సమాధానం చెప్పాలని కోరుతున్నట్లు వివరించారు. త్వరలోనే ఈ విషయంపై రైతుసంఘాల నాయకులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి దీనిపై సమగ్ర కార్యాచరణను భాజపా రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పంటసాగు విధానంపై కూలంకుశంగా చర్చించాలన్నారు. అదే విధంగా రైతు సంఘాలతో కూడా ఈ విధానంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్. ఇంద్రసేనారెడ్డి, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు, గోలి మధుసూధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

Last Updated : May 30, 2020, 3:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.