ETV Bharat / state

స్వేరోస్‌ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్‌

స్వేరోస్‌ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ సంస్థ తీరు ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

bandi sanjay, sweros
బండి సంజయ్‌, స్వేరోస్‌ సంస్థ
author img

By

Published : Mar 16, 2021, 12:43 PM IST

స్వేరోస్ సంస్థ సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ.. ఆ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే కేసీఆర్ తన విధిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

లెక్కలు ఆరా తీయాలి

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించిన ఆయన.. ఆ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వాటికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీయాలని.. లేని పక్షంలో కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వివరాలు సేకరిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.