ETV Bharat / state

BANDI SANJAY: 'తెరాస సర్కారుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు' - telangana varthalu

భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరును వారు తప్పుబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెరాస ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

BANDI SANJAY: 'తెరాస సర్కారుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు'

author img

By

Published : Jul 12, 2021, 9:30 PM IST

ఔట్‌ సోర్సింగ్ నర్సుల తొలగింపును నిరసిస్తూ ధర్నా చేపట్టిన భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరును బండి సంజయ్‌ తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహారిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని సంజయ్​ హెచ్చరించారు. నిరంకుశ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా భాజపా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వెల్లడించారు.

సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోంది..

తెలంగాణ పోలీసులు కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా మారారని ఎమ్మెల్యే రాజాసింగ్​, మాజీ ఎంపీ విజయశాంతి కలిసి విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగుల విషయంలో తెరాస ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. విధుల నుంచి తొలగించిన ఆయా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెరాస ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

ఇదీ చదవండి: KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజల పట్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.