ETV Bharat / state

వాళ్లు వద్దనుకుంటుంటే.. వీళ్లు మాత్రం కోరుకుంటున్నారు: బండి సంజయ్ - bandi on cm kcr

Bani Sanjay on TRS: రాష్ట్రంలో ఉపఎన్నిక రావాలని తెరాస కోరుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అన్ని రకాల మాఫియా వెనకాల తెరాస నేతలున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు

Bani Sanjay on TRS
Bani Sanjay on TRS
author img

By

Published : Jul 30, 2022, 7:41 PM IST

Bani Sanjay on TRS: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పాత బస్తీలోనూ పాగా వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఉపఎన్నిక రావాలని తెరాస కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఉపఎన్నిక రావొద్దని కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెరాసకు 15 సీట్ల కన్నా ఎక్కువ రావన్న అయన... ఇక కేసీఆర్‌ ఆటలు చెల్లవన్నారు.

ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. సొంతంగా సీట్లు ప్రకటించుకునే సంప్రదాయం భాజపాలో లేదని తెలిపారు. పార్టీలో ఎవరైనా కాషాయజెండా కింద పని చేయాల్సిందేనని వెల్లడించారు. అన్ని రకాల మాఫియా వెనుక తెరాస నేతలున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇన్ని రోజులుగా ప్రత్యామ్నాయం లేక అందరూ అణగిమణిగి ఉన్నారని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని.. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు.

ఇవీ చదవండి: నగరవాసులకు అలర్ట్​.. రేపు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

ట్రాన్స్​జెండర్​తో యువతి పెళ్లి.. బంధువుల షాక్​ ట్రీట్మెంట్​.. హైకోర్టు జోక్యంతో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.