ETV Bharat / state

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం: బండి సంజయ్‌

Bandi Sanjay: రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ప్రధాని మోదీ సహా రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Jun 20, 2022, 3:13 PM IST

Bandi Sanjay: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం 35 విభాగాలు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ వెల్లడించారు. సమావేశాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. జాతీయ పదాధికారులు, 18 రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. దాదాపు 300 మంది ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతారని పేర్కొన్నారు.

ఈ సమావేశాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. తెరాస ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారీ బహిరంగ నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కలిగించేలా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పది లక్షల మందితో సభను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఏవిధంగా ఇబ్బందులు పెట్టినా కూడా ముందుకే సాగుతాం.

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాని సహా ముఖ్యనేతలు 2 రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారని బండి సంజయ్‌ తెలిపారు. రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. జులై 3న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం: బండి సంజయ్‌

ఇవీ చదవండి:

'అగ్నిపథ్​' నోటిఫికేషన్ రిలీజ్.. రిజిస్ట్రేషన్​ అప్పటి నుంచే..

ఫ్లైట్​లో మంటలు.. గాల్లో 185 ప్రాణాలు.. 'సూపర్​ ఉమన్' మోనిక చాకచక్యంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.