Comic Con Exhibition 2024 : హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఇండియా పాప్ కల్చర్ ఈవెంట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వారాంతం కావడంతో కామిక్ పుస్తక ప్రియులు, ఆర్టిస్టులు, యానిమే ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కో స్టాళ్లలలో ఒక్కో రకమైన కామిక్‌లను నిర్వాహకులు ప్రదర్శించారు. యువత తమ అభిమాన కామిక్‌ల వేషధారణలను ధరించి సందడి చేశారు.
సూపర్ మాన్, స్పైడర్ మాన్, హల్క్, ఐరన్ మ్యాన్ ప్రెడేటర్, బ్యాట్మాన్.. ఇలా విభిన్న కార్టూన్ క్యారెక్టర్ల వేషధారణలతో వచ్చిన యువతతో హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. శుక్రవారం ప్రారంభమైన హైదరాబాద్ కామిక్ కాన్ షో ఇవాళ్టితో ముగియనుంది. రెండో రోజు ప్రదర్శనలు అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కామిక్-కాన్ రూపొందించిన ఈ ఫెస్టివల్లో యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్, కామిక్స్-ఓరియెంటెడ్, డాక్యుమెంటరీ, హారర్, సస్పెన్స్, హాస్యం, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, షార్ట్ -లాంగ్ ఫిల్మ్స్ ఉన్నాయి.
ప్రదర్శనలో యానిమేషన్ గేమింగ్, కార్టూన్ చిత్రాలు దర్శనమిచ్చాయి. తాము ఇష్టపడే పాత్రలు కళ్లెదుటే కనిపించడంతో పిల్లలు ఆనందంగా గడిపారు. కామిక్ చిత్రాల టీ షర్ట్స్, గృహోపకరణాల వస్తువులు, వెల్కమ్ బోర్డ్స్, జపనీస్ యానిమేషన్, కామిక్ బుక్స్, డిజిటల్ పెయింటింగ్, గ్రాఫీకరీ, కార్పొరేట్ కాన్, హ్యాపీ ఫ్లఫ్ కామిక్స్, బకర్ మాక్స్, క్రంచిరోల్ యానిమింగ్, ఎక్స్ మెన్, బ్యాట్మెన్ , మార్వెల్, డీసీ, టింకిల్, స్మెలీ-లీ సహా అనేక పాత్రల్లో యువత, చిన్నారులు సందడి చేశారు. ఔత్సాహిక యువత ఇష్టమైన కామింగ్ పాత్రల వేషధారణలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆయా పాత్రలపై అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారు.
"నాకు మార్వెల్ మూవీస్ అంటే చాలా ఇష్టం. దానిలో లోకీ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు సెట్ అవుతుందని భావించి.. నేనే స్వయంగా డ్రస్, మెటీరియల్ అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా మా టీంతో కామిక్కాన్కు వచ్చాము. నాకు యానిమేషన్ అంటే ఇష్టం. నేను భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, క్యారెక్టర్ డిజైనర్‌గా చేద్దామనుకున్నప్పుడు నేను వేసిన పాత్రతో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఇలాంటివి పిల్లలకు చాలా ఇష్టం. వారు ఇష్టపడే కామిక్ క్యారెక్టర్లు వారి కళ్ల ముందే కనిపిస్తే ఆ ఆనందం వేరు." - ప్రోగ్రాంలో పాల్గొన్న యువత
హైదరాబాద్‌లో కామిక్ షో - సూపర్ హీరోల సందడి
ఇలాంటి డ్రెస్ వేసుకున్నందుకు రూ.లక్షలు బహుమతి- ఎందుకో తెలుసా?