తెలంగాణ కమల దళపతిగా కొత్త వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌కు మరోసారి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ... అధిష్ఠానం మార్పునకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నూతన అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ప్రకటించాలని భావిస్తుంది. అధ్యక్ష ఎంపికపై రాష్ట్ర నేతల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది. లక్ష్మణ్‌ను కొనసాగించాలని సీనియర్ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
లక్ష్మణుడికా... సంజయుడికా...
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు సైతం లక్ష్మణ్‌కే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి గట్టిగా మద్దతు పలికింది. లక్ష్మణ్ నాయకత్వం పట్ల జాతీయ నాయకత్వం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ... కొత్త వారికి అవకాశం కల్పించాలనే దృక్పథంతో మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌కి అవకాశం ఇవ్వాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం అధ్యక్షుడిని మార్చాలనుకుంటోంది కాబట్టే ప్రకటన ఆలస్యమవుతన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మార్చి చివరికల్లా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
లక్ష్మణ్‌కు ఇది కాకపోతే మరొకటి
జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డాతో లక్ష్మణ్‌కు సత్సంబంధాలు ఉండటం... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జీగా నడ్డా ఉన్న సమయంలో లక్ష్మణ్ పనితీరును దగ్గరుండి పరిశీలించారు. తన పనితీరు, నడ్డాతో ఉన్న సాన్నిహిత్యంతో మరోసారి అవకాశం ఇస్తారనే ఆశ లక్ష్మణ్‌లో ఉంది. అధ్యక్షుడి మార్పు తప్పదు అనుకుంటే లక్ష్మణ్‌కు జాతీయస్థాయి పదవి ఇచ్చి... ఏదైనా రాష్ట్రానికి ఇంఛార్జీగా నియమించే అవకాశం లేకపోలేదని పార్టీ జాతీయ కీలకనేత తెలిపారు.
ఈనెల మొదటివారంలోనే..
సీఏఏకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో అధ్యక్షుడి ప్రకటన ఈనెల మొదటివారంలో వెలువడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: డెత్ వారెంట్‌పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్