అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విజృంభిస్తోన్నా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు నర్సులు అందిస్తోన్న సేవలు వెలకట్టలేనివని అన్నారు.
వైద్యులతో సమానంగా రోగులకు సేవ చేస్తోన్ననర్సులను గౌరవించాలన్నారు. కొవిడ్రోగులకు సేవలందించేందుకు బంధువులు సైతం పోలేని నిస్సహాయ స్థితిలో వారికి సేవలందిస్తోన్న నర్సుల సేవలు మరవలేనివని కొనియాడారు. వారికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని తెలిపారు.
ఇదీ చదవండి: వరుస భేటీలు.. చర్చోపచర్చలు... రాజకీయ భవిష్యత్తుపై ఈటల మథనం