ETV Bharat / state

కమలదళం ప్రచార జోరు త్వరలోనే రంగంలోకి అగ్రనేతలు - Telangana BJP MLA Candidates 2023

BJP Speed up Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని కాషాయదళం ముమ్మరం చేయనుంది. ఇప్పటికే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్‌ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రప్పిస్తోంది. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే సభలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అమిత్‌ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణకు వరుస కట్టనున్నట్లు కమలం శ్రేణులు చెబుతున్నాయి.

Telangana assembly elections BJP campaign
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 8:58 AM IST

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్న కాషాయదళం

BJP Speed up Election Campaign in Telangana : తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పాలమూరు గడ్డ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఓవైపు రాష్ట్రంపై వరాల జల్లు కురిపిస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తెలంగాణ అధ్యక్షుడు మార్పు తర్వాత.. రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిస్తేజాన్ని ప్రధాని పర్యటన కొంతమేర తగ్గించిందని చెప్పుకోవచ్చు. కమలదళపతి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి ఒక దఫా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మరో మూడు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రానున్నారు.

BJP Leaders Election Campaign in Telangana : బీజేపీ ఎన్నికల ప్రచార జోరు.. బీసీ సీఎం నినాదంతో ముందుకు..

PM Narendra Modi Telangana Tour : ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. 7న హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ ఆత్మ గౌరవ సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. కమలం పార్టీ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సభకు నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో బీసీ నినాదం క్షేత్రస్థాయిలో బలంగా వెళ్తుందని కాషాయదళం భావిస్తోంది. 11న మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని హాజరుకానున్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎన్నికల్లో విజయం సాధించేలా దిశానిర్దేశం చేయనున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రచారాన్ని హోరెత్తించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ నెల 19 తర్వాత మరోసారి ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని తొమ్మిదేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, బీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను.. బీజేపీ నాయకులు ఎండగట్టనున్నారు. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం కమలం పార్టీకి ఒక అస్త్రంగా దొరికింది. భారత్ రాష్ట్ర సమితి అవినీతి సర్కార్ అని ఆరోపిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ దీనిని ప్రచారాస్త్రంగా వినియోగించనుంది.

Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి

Telangana Assembly Election 2023 : తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు అధిష్ఠానం.. రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్‌లను సమకూర్చింది. వీటితో ముఖ్య నేతలు సుడిగాలి పర్యటన చేయనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ప్రజల్లో బండి సంజయ్‌కి ఉన్న క్రేజ్‌ను చూసిన అగ్రనాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని భావిస్తోంది.

BJP Leaders Election Campaign in Telangana : కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న బండి సంజయ్ (Bandi Sanjay).. తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే రోజుకు రెండు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చింది. మరో రెండు హెలికాప్టర్‌లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల ప్రచారానికి వినియోగించనున్నారు.

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం.. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన కమలం పార్టీ నాయకులను తెలంగాణ అసెంబ్లీ ఇంఛార్జ్‌లుగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రవాస్ యోజన పేరుతో నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్‌ ప్రకాశ్‌ జావడేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్ సహా ఇంఛార్జ్‌ అరవింద్ మీనన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

BJP Telangana Assembly Elections Strategy 2023 : బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు​.. RSS నేతలతో కలిసి ప్రచారంపై ప్రణాళికలు!

ఎన్నికల వ్యూహాలు, నియోజకవర్గంలో చేయాల్సిన కార్యాచరణపై జావడేకర్‌, తరుణ్‌చుగ్‌ మార్గనిర్దేశనం చేశారు. రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం అసెంబ్లీ ఇంఛార్జ్‌ పని చేయనున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి వ్యూహాలకు.. ప్రతి వ్యూహాలు రచిస్తూ అభ్యర్థులకు ప్రచారం చేయించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థి విజయావకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికను జాతీయ నాయకత్వానికి పంపించనున్నారు. అధిష్ఠానం ఇచ్చే సలహాలు, సూచనలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

బీజేపీని కలవరపెడుతోన్న కీలక నేతల జంపింగ్​లు ఆ రెండు పార్టీల్లో టికెట్లు దక్కని వారిని చేర్చుకుని బరిలో దింపేలా కసరత్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.