Vijayashanthi on TRS: రానున్న రోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని భాజపా సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్క భాజపాకు మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బోరబండ అల్లాపూర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విజయశాంతితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెరాస చెత్త పేరుకుపోయింది
vijayashanthi in swachh bharat: రాష్ట్రంలో తెరాస చెత్త పెద్దఎత్తున పేరుకుపోయిందని.. ఆ చెత్తను తొలగించేందుకే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తెరాస చెత్తను ఏరివేసి స్వచ్ఛమైన తెలంగాణగా మార్చడమే భాజపా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ భాజపా అధ్యక్షుడు పొన్నాల హరీష్‌రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ మాధవరం కాంతారావు, అల్లాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అంటే శుభ్రం చేయడం.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెరాస చెత్త పేరుకుపోయింది. అవినీతి చెత్త పేరుకుపోయింది. దాన్ని ఏరివేయాలంటే అది ఒక్క భాజపాతోనే సాధ్యం. స్వచ్ఛమైన తెలంగాణను సాధించాలనేది మా ఆశయం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ అవినీతి మయం అయింది. మంత్రులు, ఎమ్మెల్యేల అరాచకం కొనసాగుతోంది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం అరాచకం. ఆయనను ఏ రకంగా అరెస్ట్ చేయాలో ప్రజలకు తెలుసు. ఒక ఎంపీ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడం దేనికి సంకేతం. కేసీఆర్ సీఎంగా ఉన్నంతవరకు ఇలాంటి అరాచకాలు జరుగుతాయి. ప్రభుత్వ తీరు వల్ల యువత చనిపోతున్నారు. జీవో 317ను సవరణ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే యుద్ధం మొదలైంది. నువ్వా- నేనా అన్నదే తేలాల్సింది. నిన్ను గద్దె దించేంది ఒక్క భాజపా మాత్రమే. తెరాస, కాంగ్రెస్ , ఎంఐఎం అందరు కలిసినా మీ ఆటలు సాగవు. రాబోయే ఎన్నికల్లో నిన్ను గద్దె దించుతాం. బండి సంజయ్‌ని విడుదల చేసే వరకు 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
- విజయశాంతి, మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు
- ఇవీ చూడండి:
- BJP Mouna Deeksha in Hyderabad : 'తెలంగాణలో సర్కార్‌కు.. ప్రజలకు మధ్య యుద్ధం'
- Saidabad Incident: కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదు: విజయశాంతి
- Etela on mlc elections: 'కరీంనగర్లో తెరాస ఓ స్థానం ఓడిపోవడం ఖాయం'
- Kishan Reddy on Bandi Sanjay Arrest : 'ధర్నాచౌక్ కేసీఆర్ కోసమేనా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకూడదా?'
- Lok Sabha Speaker Respond: బండి సంజయ్ ఫిర్యాదుపై స్పందించిన లోక్‌సభ స్పీకర్