బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ మల్కాజిగిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద.. భాజపా కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోగా పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బంద్ నిర్వహిస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి... నేరెడ్‌మెట్ ఠాణాకు తరలించారు.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న భాజపా కార్యకర్తలపై.. తెరాస నాయకులు దాడికి యత్నించారు. మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ కారును గులాబీకార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎంజే మార్కెట్ కూడలి వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలోరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజేంద్రనగర్, బాలానగర్‌లోనూ ఆందోలనకు దిగిన కార్యకర్తలు....తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్‌పై దాడి హేయమైన చర్య అన్న .. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు..... బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆదిలాబాద్ వినాయక్‌చౌక్‌లో పోలీసులు, భాజపా శ్రేణుల మధ్య తోపులాట జరగటంతో.... స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాలలో ఐబీ చౌరస్తా నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తెరాస నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేట, సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్యకర్తలు.... హన్మంతరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. నిజామాబాద్, నిర్మల్‌లోనూ భాజపా నేతలు ఆందోళనకు దిగారు. మైనంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: