BJP President JP Nadda Congrats to Bandi Sanjay : రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఈటల రాజేందర్‌ను పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ క్రమంలో బండి సంజయ్ అందించిన సేవలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. అలాగే పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ట్విటర్ వేదికగా బండి సంజయ్ ఈ విధంగా స్పందించారు.
Bandi Sanjay Tweet on KishanReddy : బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి... తాజా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ట్విటర్లో శుక్షాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని... బండి సంజయ్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు అధ్యక్షుడిగా అవకాశమిచ్చినందుకు... పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడిగా పార్టీ కోసం కష్టించి పనిచేశానని ఆయన వెల్లడించారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం... బండి సంజయ్ సేవలను వాడుకుంటామన్నారు. అధ్యక్షుడిగా అద్భుతంగా పని చేశావని నడ్డా అభినందించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని... నడ్డాతో బండి సంజయ్ తెలిపారు. ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని... జేపీ నడ్డాకు హామీ ఇచ్చారు.
-
Officially signing off as @BJP4Telangana State President 🙏
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri…
">Officially signing off as @BJP4Telangana State President 🙏
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023
Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri…Officially signing off as @BJP4Telangana State President 🙏
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023
Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri…
బండి సంజయ్‌కు ఏ పదవి దక్కనుందంటే : రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలో వివిధ ఉప ఎన్నికలను ఎదుర్కోవడం కీలకమైన హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీలో 48 స్థానాల్లో గెలుపు వంటి అంశాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి అవకాశం లేకుండా మార్పు చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడం లేదంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యత అప్పగించడంపై బీజేపీ దృష్టిసారించిందని చెబుతున్నారు.
కిషన్‌రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్ : మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించిన బీజేపీ అధిష్ఠానానికి తెలంగాణ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కిషన్‌రెడ్డి పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడని.. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. అదే విధంగా ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వాహణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. కిషన్‌రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్‌గా పేర్కొన్న అరవింద్... 2024లో మోదీ మూడోసారి పీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారని... వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడ ఖాయమన్నారు. బండి సంజయ్ అగ్రెసివ్‌గా తన టర్మ్‌ను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. తామంతా కలిసి పనిచేస్తామని పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వివరించారు.
బండి సంజయ్ మార్పు బాధాకరమే అయినా : రాష్ట్రంలో బీజేపీకి నిప్పులు పుట్టించే నడకలు నేర్పిన అధ్యక్షుడు బండి సంజయ్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కొనియాడారు. ఆయన మార్పు బాధాకరమే అయినా... మరింత మంచి బాధ్యతను పార్టీ సంజయ్‌కి అప్పగిస్తుందని భావిస్తునన్నారు. దేశం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల మనోభావాలు బీజేపీ అగ్ర నాయకత్వం గుర్తించగలదని విశ్వసిస్తున్నానని విజయశాంతి పేర్కొన్నారు.
బండి సంజయ్ రాజీనామా... అభిమాని ఆత్మహత్యాయత్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజీనామాను జీర్ణించుకోలేని ఆయన అభిమాని ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలలోకి వెళితే... ఖమ్మం బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న గజ్జెల శ్రీనివాస్ సాయంత్రం సంజయ్ రాజీనామా వార్త రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అప్పుడే కళాశాల నుంచి ఇంటికి వచ్చిన తన కూతురు గుర్తించి... తలుపులు తోసుకుని ఇంట్లోకి వెళ్లి తండ్రిని గట్టిగా పట్టుకుంది. చుట్టుపక్కల వారు వచ్చి అతన్ని ఉరి నుంచి తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. శ్రీనివాస్ ఒక లేఖ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. బండి సంజయ్ అధ్యక్షుడిగా లేకపోవడాన్ని తట్టుకోలేక పోతున్నానని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి :