ETV Bharat / state

Praja Sangrama Yatra: కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం - తెలంగాణ వార్తలు

ప్రజాసంగ్రామ యాత్రకు(Praja Sangrama Yatra) భాజపా(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) శంఖం పూరించారు. చార్మినార్(charminar) భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. యాత్రకు శ్రీకారం చుట్టారు. బండి సంజయ్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy), భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్(tarun chugh), పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియంతృత్వ, కుటుంబ పాలనను అంతం చేయాలని భాజపా నేతలు అన్నారు.

bjp-praja-sangrama-yatra-started-against-cm-kcr-ruling-in-telangana-by-bandi-sanjay

author img

By

Published : Aug 28, 2021, 4:21 PM IST

యాత్రకు శ్రీకారం

2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా(bjp) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(bandi sanjay) ‘ప్రజాసంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. చార్మినార్‌(charminar) భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు బండి సంజయ్ చెప్పారు. రాజకీయ మార్పునకు వేదిక కానుందని అన్నారు. ఈ యాత్రను భాజపా జాతీయనేత అరుణ్‌సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు పాతబస్తీలో 10కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.

మాయ మాటలతో మోసం

పాతబస్తీలో ఎంఐఎం(aimim) ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని ఆయన మండి పడ్డారు. పాతబస్తీ వదిలివెళ్లిన హిందువులంతా ధైర్యంగా తిరిగిరావాలని స్పష్టం చేశారు. మాయమాటలతో మభ్యపెడుతూ అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఏడేళ్లు దాటినా... ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు(Praja Sangrama Yatra) వచ్చిన అందరికీ బండి సంజయ్​ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా ఒక్క కుటుంబమే పాలిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. దళితులకు మూడెకరాల భూమి హామీని నెరవేర్చలేదు. ఉద్యోగాల కోసం 30లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం... రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గడం లేదు.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

బీసీలకు వెన్నుపోటు

తెరాస ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy) ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపించాలని సవాల్ చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉంది. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కుటుంబ పాలన తీసుకొచ్చారు. కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారింది. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాబోతుంది. వేల కోట్ల రూపాయల ప్రజా సంపద దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి.

-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

భాజపానే ప్రత్యామ్నాయం

తెరాస పాలనను ఆలీబాబా 40దొంగలతో పోల్చారు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్(tarun chugh). ఈ యాత్రతో కేసీఆర్ లంక కొట్టుకుపోతుందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలగాలని అన్నారు. రాష్ట్రంలో తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని సీనియర్ నాయకులు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనకు అంతం చేస్తామని స్పష్టం చేశారు.

తొలి విడత యాత్ర

మొత్తం నాలుగు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనుండగా తొలి విడతగా చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్‌, బేగంబజార్, మొజంజాహి మార్కెట్‌, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌, నాంపల్లి, అసెంబ్లీ లక్డీకపూల్, మసాబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం వరకు కొనసాగనుంది. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో శనివారం రాత్రి బస చేస్తారు. మొదటి విడత పాదయాత్రను అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు హుజురాబాద్‌లో ముగించేలా ప్రణాళికలు చేశారు. ఈ ప్రారంభ పాదయాత్రలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతి, నిజామాబాద్ ఎంపీ అరవింద్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బంగారు మయమైంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.