Telangana BJP latest news : తెలంగాణలో అవినీతి రహిత పరిపాలన కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే గూటి పక్షులని ఆయన అభివర్ణించారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.
కవాడిగూడ డివిజన్లోని పోల్బాగ్ గంగపుత్ర కాలనీ, గగన్‌మహల్, దోమలగూడలోని తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి లక్ష్మణ్, పార్టీ శ్రేణులు కరపత్రాలను పంచారు. అలాగే ఇంటింటికి పార్టీ స్టిక్కర్లను అతికించి మోదీ పాలన గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా మార్పు కోరుకుంటున్నారని.. తెలంగాణలో అవినీతి రహిత పరిపాలన కావాలంటే బీజేపీ సర్కార్ రావాల్సిందే అని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో మాదిరి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని తెలిపారు. నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. మోదీ అందించిన పథకాలు, విజయాలను ఇంటింటికి వెళ్లి ప్రస్తావిస్తే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారని అన్నారు. ఈ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా భావిస్తున్నామని.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ప్రజలు చెబుతున్నట్లు ఆయన వివరించారు.
మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బియ్యం సరఫరా, కొవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఆర్ధికసాయం మొదలగు పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. ఇంటింటీకీ బీజేపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అవినీతి పాలన అందించాయని విమర్శించారు. ప్రజలు.. అవినీతి రహిత మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
"ప్రజలు మార్పు స్పష్టంగా కోరుకుంటున్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు. మోదీ అందించిన పథకాలు, విజయాలను ఇంటింటికి వెళ్లి ప్రస్తావిస్తే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నరేంద్ర మోదీ 9 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. మోదీ అందించిన పథకాలు, విజయాలను ఇంటింటికి వెళ్లి ప్రస్తావిస్తే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా భావిస్తున్నామని.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ప్రజలు చెబుతున్నారు." - డాక్టర్ కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
ఇవీ చదవండి: