కోట శ్రీనివాస్‌ను మించిన నటుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్ మండి భాజపా అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ప్రచారంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బౌద్ధనగర్‌లోని గల్లీగల్లీలో జీపు యాత్రలో పాల్గొని ప్రచారం చేశారు.
ప్రచారంలో ఇసుక వేస్తే.. కనిపించనంత పెద్ద ఎత్తున ప్రజలు కాషాయ జెండాలు, కండువాలు ధరించి పాల్గొన్నారు. కేసీఆర్ పరిపాలన చూస్తుంటే.. ఆహ నా పెళ్లాంట సినిమాలోని కోట శ్రీనివాస్ నటన గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. తెరాస పాలన అవినీతిమయం, హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. అవినీతిరహిత పాలన, భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే... భాజపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. భాజపాని గెలిపిస్తే.. రూపాయి ఖర్చు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కారిస్తామని హామీనిచ్చారు. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని వివరించారు.
- ఇదీ చూడండి: దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్