ETV Bharat / state

'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు' - BJP National Vice President DK Aruna latest comments

తెలంగాణ రాష్ట్రానికి నిధులు తగ్గించాలని 15వ ఆర్థిక సంఘం సూచించినా... ప్రధాని మోదీ తగ్గించలేదన్నారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మేకిన్ ఇండియా విజన్​తో మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'

author img

By

Published : Feb 1, 2021, 8:06 PM IST

పార్లమెంట్​లో నిర్మలా సీతారామన్ 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం మహిళలకు గర్వకారణమని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా... ఆత్మ నిర్భర ప్యాకేజీకి భారీగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. వైద్య రంగానికి రూ. 2.2 లక్షల కోట్లు కేటాయించారని... కొవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు రూ. 35 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

వైద్య రంగానికి భారీ కేటాయింపులు ఇవ్వడం అభినందనీయమని అరుణ పేర్కొన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు చేశారన్నారు.

రైతులకు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కోసం రూ. లక్ష 72 వేల కోట్లు కేటాయించారని... మార్కెట్ కమిటీల బలోపేతానికి మరిన్ని నిధులను కేంద్రం బడ్జెట్​లో కేటాయింపులు చేసిందన్నారు. రైతులను తప్పు దోవ పట్టించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆమె కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి నిధులు తగ్గించాలని 15వ ఆర్థిక సంఘం సూచించినా... ప్రధాని మోదీ తగ్గించలేదన్నారు. మేకిన్ ఇండియా విజన్​తో మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని డీకే అరుణ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.