రాష్ట్రంలో విద్యావ్యవస్థ తిరోగమన దిశలో సాగుతోందని భాజపా సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు దుయ్యబట్టారు. చాలా విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉపకులపతులు లేరని అన్నారు.
చాలా వర్సిటీల్లో అంతంతమాత్రం అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారని... ఏటికేడు పెరుగుతున్న ఖాళీలను భర్తీ చేయడంలేదని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయలు, యువత మార్పు కోరుకుంటోందని... వారంతా భాజపా వెంటే ఉన్నారని మురళీధర్‌రావు అన్నారు.
- ఇదీ చూడండి : ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు