ETV Bharat / state

'రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలి' - సీఎం కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్

Laxman Fires on KCR: రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీల కతీతంగా ప్రధానిని ఆహ్వానిస్తుంటే... తెలంగాణలో మాత్రం ప్రధానిని స్వాగతించటం లేదని మండిపడ్డారు. మోదీ రావొద్దని బ్యానర్లు పెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని లక్ష్మణ్ హితవు పలికారు.

Laxman
Laxman
author img

By

Published : Nov 11, 2022, 3:35 PM IST

Laxman Fires on KCR: పార్టీలు, ప్రభుత్వాలు వేరు వేరని.. రాజకీయం, అధికారిక కార్యక్రమాలకు మధ్య వ్యత్యాసాలను సీఎం కేసీఆర్ గుర్తించడం లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీల కతీతంగా ప్రధానిని ఆహ్వానిస్తుంటే... తెలంగాణలో మాత్రం ప్రధానిని స్వాగతించటం లేదని మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

రాష్ట్రంలో రేపటి ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం వద్ద కిషన్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మణ్‌... మోదీ రావొద్దని బ్యానర్లు పెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని లక్ష్మణ్ దుయ్యట్టారు. ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండడం ఇది మూడోసారి అన్న ఆయన.. సాకులతో దూరంగా ఉండటం సబబు కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నా మోదీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. అలాంటిది ప్రధాని పర్యటనను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు.

రాజకీయాలకతీతంగా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని ఎంపీ లక్ష్మణ్ హితవు పలికారు. ఏపీ సీఎం జగన్​ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు తెలంగాణకే నష్టమని లక్ష్మణ్ తెలిపారు. గతంలో ఎరువుల కోసం బారులు తీరేవారని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా కొరత తీరనుందని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు బీమా ఎందుకు ఇవ్వట్లేదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

'దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పర్యటన కొనసాగుతుంది. పార్టీలకతీతంగా ప్రధానిని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ప్రధానిని స్వాగతించడం లేదు. ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండడం ఇది మూడోసారి. రాజకీయం, అధికార కార్యక్రమాల మధ్య వ్యత్యాసం తెలియదా? రాజకీయం వేరు, ప్రధాని చేస్తున్న కార్యక్రమాలు వేరు. రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. పార్టీల విబేధాలను పక్కన పెట్టాలని కోరుతున్నాం. అభివృద్ధి చేయాలని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదు.'-లక్ష్మణ్, భాజపా రాజ్యసభ సభ్యుడు

'రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలి'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.