ETV Bharat / state

'ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఆ ప్యాకేజీ'

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకిటించారని భాజపా ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు అన్నారు. భారతదేశం స్వయం సమృద్ధిగా ఎదిగి మరింత ముందుకు పోతుందని ఆయన చెప్పారు.

bjp mlc ramchander Rao comment The package to strengthen the Indian economy
'ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఆ ప్యాకేజీ'
author img

By

Published : May 13, 2020, 1:10 PM IST

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారత్​ వైపు చూస్తున్నాయని భాజపా ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేలా అధికారులు చూడాలని రామ్‌చందర్‌రావు కోరారు. బేగంపేట బ్రాహ్మణవాడలోని భాజపా నగర కార్యవర్గ సభ్యుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

'ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఆ ప్యాకేజీ'

ఇదీ చూడండి : ఏపీలో మరో 48 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.