ఆర్టీసీని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. తక్షణమే కార్మికులను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా కార్మికులను చర్చలకు పిలవకపోవడం శోచనీయమని ఆక్షేపించారు. ఆర్టీసీ ఉద్యమ అణచివేతను ప్రజలు ఆమోదించారని ముఖ్యమంత్రి చెప్పడం తగదన్నారు. హుజూర్నగర్లో తెరాస గెలుపు మీ పరిపాలనకు ఆమోద ముద్రకాదని సీఎంనుద్దేశించి పేర్కొన్నారు. నవంబర్‌లో జరగబోయే పురపాలక సంఘాల ఎన్నికలకు భాజపా సిద్ధంగా ఉందన్నారు రామచంద్రరావు.
ఇవీచూడండి: జీతాలివ్వాలంటే బస్టాండ్లు అమ్మాలి: కేసీఆర్