ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులతో పేదలందరికీ రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలని భాజపా ఎమ్మెల్సీ రామచందర్రావు డిమాండ్ చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బోయిగూడలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
ప్రభుత్వం అలసత్వం వల్లనే..
ఇప్పుడు మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తుంన్నందున మరోసారి ప్రజలను మోసం చేసేందుకు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సకాలంలో ఇళ్లు నిర్మించకపోవడం వల్లే నాంపల్లి మాంగార్ బస్తీలో పురాతన ఇల్లు గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కేవలం రూ.3లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారన్నారు.
సీఏఏ విషయంలో మజ్లిస్ అధినేత అసద్దుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారంతో అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి మత రాజకీయాలు చేస్తే ప్రజలు తిప్పికోడుతారని రామచందర్ రావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః అమ్మను వదిలించుకునేందుకు ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా?