ETV Bharat / state

BJP MLAS IN TG: బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదు - భాజపా వార్తలు

బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు లేదా మూడు రోజులు సరిపోవని... కనీసం 15 రోజులు చర్చించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు.

BJP MLAS IN TG
భాజపా ఎమ్మెల్యేలు
author img

By

Published : Sep 24, 2021, 12:50 PM IST

Updated : Sep 24, 2021, 2:15 PM IST

ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను 15 రోజులైనా నిర్వహించాలని... భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రారంభం సందర్భంగా... ట్యాంక్ బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు.

భాజపా ఎమ్మెల్యేలు

దళిత బంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్... దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమిపై కూడా మోసం చేశారన్నారు. మరోసారి దళిత బంధు పేరుతో... దళితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాలను రెండు మూడు రోజులే కాకుండా.. ఒక పదిహేను రోజులైనా నిర్వహించాలి. తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దళిత బంధు మంచి స్కీమ్. ఇంత మంచి పథకాన్ని ఒక్క నియోజకవర్గానికే పరిమితం ఎందుకు చేశారు? కేవలం హుజూరాబాద్​ను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని తీసుకు వచ్చారా?

-రాజాసింగ్,​ ఎమ్మెల్యే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దళితులకు జరుగుతున్న అన్యాయంపై కోనేరు రంగారావు వేసిన కమిటీ నివేదికను.. గిరిజన భూముల హక్కులుపై వేసిన కమిటీ నివేదికపై కూడా చర్చించాలని రఘునందన్ రావు కోరారు. పెన్షన్, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలతో పాటు... ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రకటించిన 30 ఫిట్​మెంట్​లపై పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చూడండి: Telangana assembly sessions 2021 : ఉభయ సభలు సోమవారానికి వాయిదా

Last Updated : Sep 24, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.