ETV Bharat / state

బీజేపీలో అసమ్మతి జ్వాల - అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం

BJP MLA Tickets Issues in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపి సీటు దక్కకపోవడంతో.. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో బీజేపీ నిమగ్నమైంది. ఎన్నికల్లో వారితో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల్లోని అసంతృప్తులను పిలిచి మాట్లాడాలని కమలం పార్టీ నిర్ణయించింది.

Bjp MLA Tickets Issues in Telangana 2023

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 8:24 AM IST

బీజేపీలో అసమ్మతి జ్వాల అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమైన రాష్ట్ర నాయకత్వం

BJP MLA Tickets Issues in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపి సీటు దక్కకపోవడంతో (BJP MLA Tickets Issues in Telangana).. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైంది. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని వీడగా.. టికెట్ దక్కని నేతల తీరు పార్టీకి సంకట పరిస్థితిని తెచ్చిపెట్టడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇన్ని రోజులు అసంతృప్తులని పెద్దగా పట్టించుకోని కాషాయ పార్టీ.. క్రమంగా ఒక్కొక్కరిని బుజ్జగిస్తోంది. వారిని దారికి తెచ్చుకోకుంటే ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు

జీహెచ్‌ఎంసీకి చెందిన పలువురు కార్పొరేటర్లతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (BJP State President Kishan Reddy).. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొందరు మాటవిన్నా.. మరికొందరు గుర్రుగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 మంది.. కమలం పార్టీ కార్పొరేటర్లు గెలిచి సత్తాచాటారు. గెలిచిన కార్పొరేటర్లలో చాలామంది శాసనసభ టికెట్ ఆశించారు. కొందరు కార్పొరేటర్లు దాదాపు రెండు నుంచి ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు.

BJP Focus on Dissatisfied Leaders : వారిలో ఎవరికీ టికెట్ కేటాయించకపోవడంతో.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కష్టపడిన తమకు కాకుండా వేరేవారికి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలస్యంగానైనా రంగంలోకి దిగింది. మహేశ్వరం, ఎల్బీనగర్ సహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లను కిషన్‌రెడ్డి బుజ్జగించినట్లు సమాచారం.

Telangana BJP MLA Tickets Disputes : సనత్‌నగర్ టికెట్‌ ఆశించిన ఆకుల విజయ.. ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. కానీ ఆ స్థానాన్ని మర్రి శశిధర్‌రెడ్డికి కేటాయించడంతో అసంతృప్తితో ఉంది. ఆమెకు మంచి బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాల్లోనూ అసమ్మతి నేతల పోరు తీవ్రంగానే ఉంది. ఆ సెగలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు తాకాయి. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లిందంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ

Telangana Assembly Elections 2023 : ఇటీవల బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. కొందరు పార్టీ జిల్లా అధ్యక్షులకు టికెట్ దక్కింది. అయితే పార్టీ కోసం కష్టపడిన ఇతర నేతలు టికెట్ ఆశించారు. అయితే జిల్లా అధ్యక్షులకు రావడంతో కినుకు వహించారు. గుర్తింపు లేదంటూ అలకబూనిన వారికి బాధ్యతలు కట్టబెట్టాలని.. కమలం పార్టీ భావించింది. జిల్లా అధ్యక్షులకు టికెట్ కేటాయించిన చోట.. స్థానిక ముఖ్య నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

కొత్తగూడెం స్థానం ఆశించిన రంగాకిరణ్‌కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి శాంతింపజేశారు. కాగా టికెట్ ఆశించి దక్కని వారందరికి ఫోన్లు చేయాలని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కిషన్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. సమస్యలకు పరిష్కారం చూపించి ఎన్నికలకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల టికెట్ వస్తుందని భావించిన నేతలు.. ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిసింది. మరి వారిని పార్టీ ఎలా సయోధ్య కుదురుస్తుందనేది వేచి చూడాల్సిందే.

42 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా విడుదల, చర్చల అనంతరం విజయశాంతి, రఘునందన్ రావు పేర్లు

ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.