ETV Bharat / state

BJP MLA Ticket Applications Telangana : ఎమ్మెల్యే ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు.. తొలిరోజు 182 అప్లికేషన్లు

BJP MLA Ticket Applications Telangana 2023 : రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. తొలి రోజు దరఖాస్తుల స్వీకరణకు భారీ స్పందన వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణలో ఆశావాహుల నుంచి 182 దరఖాస్తులు అందాయి. స్వీకరణకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్​ను ఏర్పాటున చేశారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ కౌంటర్ ఇంచార్జీలుగా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

MLA Ticket Applications
BJP Invites MLA Ticket Applications
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 11:49 AM IST

BJP MLA Ticket Applications Telangana ఎమ్మెల్యే ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు.. తొలిరోజు 182 అప్లికేషన్లు

BJP MLA Ticket Applications Telangana 2023 : శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. తొలి రోజే ఆశావాహుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే పదవ తేదీ నాటికి వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలి రోజు 63 మంది ఆశావాహులే 182 దరఖాస్తులను సమర్పించారు. ఒక్కొక్కరూ రెండు, మూడు అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు పెట్టుకున్నారు. తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్న స్థానం దక్కకపోతే మరో చోటైన అవకాశం దక్కుతుందనే ఆశతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

BJP Telangana Election Plan 2023 : 35-40 సీట్లకు ముందే అభ్యర్థులు.. ఎన్నికలకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలు

Telangana BJP MLA Ticket Applications 2023 : సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి తొలి దరఖాస్తు వచ్చింది. రవి ప్రసాద్​గౌడ్‌ తొలి దరఖాస్తు పెట్టుకున్నారు. సరూర్​నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్‌, ముషీరాబాద్​తో పాటు సనత్​నగర్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అప్లికేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజర్ల సత్యవతి, వేములవాడ నుంచి తుల ఉమ దరఖాస్తు చేశారు. అప్లికేషన్ ఫీజు లేకపోవడంతో తొలిరోజు దరఖాస్తులకు భారీ స్పందన వచ్చింది.

'ఆ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది'

Telangana BJP MLA Candidates List 2023 : బీజేపీలో అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సంప్రదాయాన్ని అమలు చేసిన కమలం పార్టీ అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో వడపోత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.

తొలిరోజు దరఖాస్తు చేసుకునేందుక పలువురు ఆశావహులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చారు. పలువురు దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Telangana BJP Chief Kishan Reddy) రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆశావహులకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆశావహులు తాము వచ్చిన పనిని చూసుకుని వెళ్లిపోవాలి తప్పితే మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. మీడియాతో మాట్లాడినట్లు తమ దృష్టికి వస్తే అప్లికేషన్లను పక్కన పెడుతామని హెచ్చరించారు.

తొలి అభ్యర్థుల జాబితాను సెప్టంబరు 17 తరువాత ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ జాబితాలో ఎలాంటి విభేదాలు, అసంతృప్తులు లేనటువంటి 35 నుంచి 40 మందితో కూడిన జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన తరువాత రెండు జాబితా ప్రకటించాలని భావిస్తోంది. కాంగ్రెస్‌లో సీటు దక్కని బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపాలని భావిస్తోంది. మూడు నుంచి నాలుగు జాబితాల్లో అభ్యర్థులను కాషాయపార్టీ ప్రకటించనుంది. రెండో జాబితా ఎక్కువ మంది అభ్యర్థులతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

భాజపాను గెలిపిస్తే.. స్మార్ట్​ సిటీ చేస్తా: డీకే అరుణ

BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో .. బీజేపీ బస్సు యాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.